కోడూరు గ్రామానికి చెందిన పళ్ళ కొట్టు వ్యాపారి కొమ్ముకూరి గంగరాజు బుధవారం ఉదయం 5.30 గంటలకు ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఆయన కుటుంబ సభ్యులు కోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కోడూరు ఎస్సై చాణిక్య మాట్లాడుతూ, గంగరాజు ఆచూకీ తెలిసినవారు పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని గురువారం కోరారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.