జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా, కోడూరు మండలం బడేవారిపాలెంకు చెందిన సమగ్ర శిక్ష సెక్టోరియల్ ఆఫీసర్ బడే కిషోర్ బాబు రూ. 8 లక్షల వ్యయంతో బడేవారిపాలెం, ఉల్లిపాలెం, లింగారెడ్డిపాలెం జడ్పీ హైస్కూళ్లలో సైన్స్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విద్యార్థులు పరిశోధనల పట్ల ఆసక్తితో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.