ఎండ తీవ్రత వల్ల వడదెబ్బతో కోడూరులో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోడూరు ఎస్సై చాణక్య వివరాల మేరకు.. కోడూరు ఒకటో వార్డుకు చెందిన బడే వెంకటేశ్వరరావు (62) మంగళవారం మధ్యాహ్నం ఎండ తీవ్రతకు ఇంటి వద్ద కుప్పకూలి మృతి చెండారు. మృతుని భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.