కోడూరు మండలం పోటుమీద గ్రామంలో మాజీ సర్పంచ్, మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు కడవకొల్లు నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని సోమవారం ఉదయం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగేశ్వరరావు మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. నాగేశ్వరరావుతో తమకున్న అనుబంధం స్మరించుకున్నారు. ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు.