కోడూరు: శాకాంబరీ దేవిగా దర్శనం ఇచ్చిన నాంచారమ్మ

కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామంలో కొలువై ఉన్న అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయం నందు శనివారం శ్రీ శాకంబరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాడ మాసం సందర్భంగా నాచారమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి నట్లు ఆలయ ఈవో జయశ్రీ తెలిపారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకాంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించేందుకు భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్