కోడూరు: పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పీ4 కార్యక్రమం

పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పీ4 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లు నియోజకవర్గ ప్రత్యేక అధికారి సాయిబాబు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం కోడూరు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని దాతలు పలు కుటుంబాలను దత్తత తీసుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎంపీడీవో సుధా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్