కోడూరు మండలంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. నేలకొరిగిన పంటలను పరిశీలించి, స్థానిక రైతులతో మాట్లాడారు. ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.