కోడూరు మండలం జరుగువానిపాలెం గ్రామంలో పచ్చ నాగరాజు తన ఇంటి వద్ద ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేశాడనే సమాచారం మేరకు, శుక్రవారం రాత్రి ఎస్ఐ చాణిక్య మరియు సిబ్బంది, మధ్యవర్తుల సమక్షంలో అతన్ని అరెస్ట్ చేశారు. సుమారు 1000 కేజీల రేషన్ బియ్యాన్ని, 25 గోనె సంచులలో స్వాధీనం చేసుకున్నారు. పచ్చ నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.