మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీన కోడూరు మండలం హంసలదివి సముద్ర తీరానికి రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 50 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడానికి కోడూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో సుధా ప్రవీణ్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.