కోడూరు: అల్లకల్లోలంగా మారిన సముద్రం

తీవ్రమైన ఈదురు గాలుల కారణంగా హంసలదీవి బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ అలలు ఎగసిపడుతుండటంతో, రక్షణ చర్యల్లో భాగంగా శనివారం పాలకాయతిప్ప కరకట్ట వద్ద బీచ్ గేట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ S. V. K కుమార్ తెలిపారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే గేట్లు తిరిగి తెరుస్తామని, పర్యాటకులు తమ పర్యటనలను వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్