కోడూరు మండలంలోని లింగారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని జరుగువానిపాలెం గ్రామంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దాసరి కృష్ణకుమారి (67) అనే మహిళ విద్యుత్ఘానికి గురై మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం, కృష్ణకుమారి మోటార్ స్విచ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. మృతురాలి భర్త అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు.