పెదప్రోలు: అద్దంకి నాంచారమ్మ వారికి ఆషాడ సారే

మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచారమ్మ వారికి భక్తులు, గ్రామస్తులు ఆషాడ సారే సమర్పించారు. ఆషాడ మాసం సందర్భంగా ఆదివారం గ్రామంలోని ప్రధాన సెంటర్ నుండి మహిళలు పసుపు కుంకుమ సారే మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకోవచ్చి అమ్మవారికి ఆషాడ సారే సమర్పించారు. శ్రీ అద్దంకి నాంచారమ్మ వారికి ఉదయం శాకంబరి అలంకరణ చేశారు. కూరపాటి కోటేశ్వరరావు భక్తులకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు

సంబంధిత పోస్ట్