మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలో శుక్రవారం 40 రోజుల పసికందు చెరువులో పడి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటనపై చల్లపల్లి సిఐ ఈశ్వర్ రావు, మోపిదేవి ఎస్ఐ గౌతమ్ కుమార్ వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.