మోపిదేవి: స్వామివారిని దర్శించుకున్న నటుడు బాబీ సింహ

తెలుగు, మలయాళం, కన్నడ భాషా చిత్రాల నటుడు బాబీ సింహ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన తొలుత నాగపుటంలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్