మోపిదేవి: స్వామిని దర్శించుకున్న మాజీ గవర్నర్ కుటుంబీకులు

మోపిదేవి గ్రామంలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సిక్కిం మాజీ గవర్నర్ కీర్తిశేషులు వి. రామారావు సతీమణి, కుమారుడు మరియు కుటుంబ సభ్యులు సోమవారం దర్శించుకున్నారు. వీరిని ఆలయ మర్యాదలతో శ్రీరామ వరప్రసాదరావు ఘనంగా సత్కరించారు. ప్రసాదాలను అందజేసి, శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు.

సంబంధిత పోస్ట్