మోపిదేవి మండలంలో కాలువలకు సాగునీరు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని 12 నెంబర్ కాలువ ఎండిపోయి దర్శనం ఇస్తుంది. బోర్లపై ఆధారపడి రైతులు సాగు చేస్తున్నారు. కాలువకు గండి పడి పది రోజులు కావొస్తున్నా ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. తాము వ్యవసాయ పనులు ఏ విధంగా చేసుకోవాలని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు