కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా రూ. కోటి నిధులతో నూతన కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించిన మూడు సీసీ రోడ్లను, రూ. 97 లక్షలతో నిర్మించిన మోపిదేవి - వెంకటాపురం తారు రోడ్డును ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఎంపీ బాలశౌరి ఈ సందర్భంగా తెలిపారు.