మోపిదేవి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో అమ్మవార్లకు ఆషాఢ సారె సమర్పించారు. శుక్రవారం గ్రామంలోని ఆర్యవైశ్య సంఘ మహిళలు ర్యాలీగా బయలుదేరి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవల్లి, దేవసేన అమ్మవార్లకు ఆషాఢ సారె అందించారు. ప్రతి సంవత్సరం స్వామి, అమ్మవార్లకు ఆషాఢ సారె ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు.