మోపిదేవి మండలం పెదకల్లేపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ దుర్గా అమ్మవారికి శాకంబరి అలంకరణ నిర్వహించారు. ఆషాడ మాసంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ శాఖంబరి అలంకరణ గురువారం నిర్వహించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ్ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు ప్రసాద్ మరియు విజయ్ కుమార్ల ఆధ్వర్యంలో అర్చక బృందం అమ్మవారికి పూజలు చేశారు.