మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి రూ. 8. 05 లక్షల ఆదాయం!

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం ఒక్కరోజులో వివిధ సేవల టిక్కెట్ల ద్వారా రూ. 8,05,614 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారని ఈవో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్