మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఆదివారం తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంతో పాటు పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేశారు. నాగవల్లి వృక్షం వద్ద ముడుపులు కట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం నాగ పుట్ట వద్ద పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు.