మోపిదేవి: స్వామివారి హుండీల ఆదాయం కోటి రూపాయలు

మోపిదేవి గ్రామంలో స్వయంభువుగా కొలువుతీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హుండీ తెరవగా, రూ. 1, 11, 75, 901ల ఆదాయం వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాద రావు తెలిపారు. బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ కృష్ణా జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎన్. వి సాంబశివరావు, దేవాదాయ శాఖ తనిఖీ అధికారి కె. శ్రీనివాసరావు పర్యవేక్షణలో లెక్కించారు. 104 రోజులకు ఈ లెక్కింపు జరిగింది.

సంబంధిత పోస్ట్