మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం భక్తులతో పోటెత్తింది. మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేశారు. దోష నివారణ పూజలు అర్చకులు నిర్వహించారు. నాగవల్లి వృక్షం వద్ద ముడుపులు కట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు పర్యవేక్షించారు.