నాగాయలంక: 8మంది పేకాట రాయుళ్లు అరెస్టు

నాగాయలంక మండలంలోని సంగమేశ్వరం గ్రామంలో శనివారం అర్థరాత్రి పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగాయలంక సబ్ ఇన్స్పెక్టర్ కే రాజేష్ నేతృత్వంలో జరిగిన ఈ మెరుపుదాడిలో, వారి వద్ద నుంచి 7300 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్