విద్యుత్ వినియోగదారులు విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణనాయక్ అన్నారు. నాగాయలంక మండలంలో శుక్రవారం విద్యుత్ విజిలెన్స్ అధికారులు, సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 303 అదనపు లోడు సర్వీసులు, 380 కెడబ్ల్యూ మొత్తానికి అపరాధ రుసుము రూ. 7 లక్షల 60 వేలు విధించినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.