నాగాయలంక: 16న మండల పరిషత్ నూతన ఉపాధ్యక్షుడి ఎన్నిక

భావదేవరపల్లి ఎంపీటీసీ,మండల పరిషత్ ఉపాధ్యక్షుడుగా ఉన్న పరిశే అమ్మన్న కొద్ది నెలలు క్రిందట మృతి చెందారు. ఆ స్థానంలో నూతన ఎంపీటీసీని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు నాగాయలంక ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జి. సుధాప్రవీణ్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు మండలంలోని ఎంపీటీసీలకు సమాచారం అందించామన్నారు. ఈ ఎన్నికకు జిల్లాస్థాయి అధికారులు పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్