నాగాయలంక: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఎదురెదురుగా రెండు బైక్ లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇరువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన జన్ను రామాంజనేయులు (40) సోమవారం ఏటిమొగ వెళ్లేందుకు పల్సర్ బైక్ పై నాగాయలంక నుంచి  పెదపాలెం వైపు వెళ్తున్నాడు. ఈలచెట్లదిబ్బ గ్రామస్థులు చెన్ను నాగేశ్వరరావు బైక్ తో ఎదురుగా వస్తున్న రామాంజనేయులు బైక్ ను ఢీ కొట్టాడు. ప్రమాదంలో తలకు గాయమైన రామాంజనేయులు మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్