నాగాయలంక మండలంలోని నంగేగడ్డ గ్రామంలో గ్రామ టీడీపీ ఆధ్వర్యంలో టీడీపీ జెండా దిమ్మ చెంతన దివంగత ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. శుక్రవారం విగ్రహం పెట్టే దిమ్మ కాంక్రీట్ పనులు చేస్తుండగా, మండల టీడీపీ అధ్యక్షులు మెండు లక్ష్మణరావు ఆ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు తాడేపల్లి వెంకట పాపారావు, అమ్ముల సుబ్బారావు, మిరియాల రామాంజనేయులు తదితరులు ఉన్నారు.