గురువారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మోపిదేవి మండల పరిధిలోని పెద్దకళ్లేపల్లి - వెంకటాపురం ప్రధాన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. నాబార్డ్ నిధులు రూ. 2.60 కోట్లతో వెంకటాపురం నుంచి పెద్దకళ్లేపల్లి వరకూ 4.4 కిలోమీటర్ల పొడవు, 3.75 మీటర్ల వెడల్పుతో ఈ నూతన రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, ఇంచార్జి ఎంపీపీ నడకుదుటి జననికుమారి కూడా పాల్గొన్నారు.