బాపులపాడు: టీచర్ పైన విద్యార్థి దాడి

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జడ్పీ హై స్కూల్‌లో విద్యార్థులు ధూమపానం చేస్తుండగా ఉపాధ్యాయులు మందలించారు. దీనికి ఆగ్రహించిన ఒక విద్యార్థి ఉపాధ్యాయుడిపై దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన విద్యార్థులకు విలువలతో కూడిన బోధన, తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎంత అవసరమో తెలియజేస్తోంది.

సంబంధిత పోస్ట్