విశాఖలోని పెందుర్తి కేంద్రంగా నడుస్తున్న నకిలీ కరెన్సీ దందాను కృష్ణాజిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. 'రూ.30 వేల అసలు నగదు ఇస్తే.. రూ.లక్ష నకిలీ నోట్లు మీ సొంతం' అంటూ అమాయకులను మోసం చేస్తున్నట్లు SP విద్యాసాగర్ వెల్లడించారు. అత్యాశకు పోయిన కృష్ణాజిల్లా కృత్తివెన్ను ప్రాంతానికి చెందిన వ్యక్తులు పాత నేరస్థులతో చేతులు కలిపి ఈ అక్రమ వ్యవహారంలో భాగస్వాములైనట్లు తెలిపారు.