గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా కానూరులో నివసించే వి. చెన్నారావును పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయన మరో ఇద్దరితో కలిసి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇటీవల గన్నవరం, గతంలో పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.