మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గన్నవరం టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో, అంబటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని నేతలు మండిపడ్డారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద అంబటి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.