గన్నవరంలో లింగ నిర్ధారణ అక్రమ రాకెట్ నడుస్తోందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోవిందరాజులు బుధవారం గన్నవరంలో తెలిపారు. ప్రభుత్వ వైద్యులు, మాజీ ల్యాబ్ టెక్నీషియన్లు, ఆర్ఎంపీలు కలిసి మగబిడ్డ పేరుతో నకిలీ స్కానింగ్ రిపోర్టులు ఇచ్చి రూ. 1-5 లక్షలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ముఠాపై సిట్ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.