గన్నవరంలో శనివారం వడదెబ్బ కారణంగా ఒక వ్యక్తి మృతి చెందాడు. ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రతలు, తీవ్ర ఎండల వల్ల అస్వస్థతకు గురైన అంజి అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు స్థానికులు తెలిపారు. అతని మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రజలు ఎండల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.