గన్నవరం: సొంత ఇంటి కలను నెరవేర్చడమే నా లక్ష్యం

గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే తన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మంగళవారం గన్నవరం టీడీపీ కార్యాలయం వద్ద ‘ఆంధ్రప్రదేశ్ భూ క్రమబద్ధీకరణ పథకం-2025’ కింద లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. వెదురుపావులూరు గ్రామానికి చెందిన 19 మంది, వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన 52 మంది మొత్తం 71 మందికి పట్టాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్