గన్నవరం గాంధీ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ గాంధీజీ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆవిష్కరించారు. గత కొంతకాలంగా సరైన నిర్వహణ లేక దయనీయ స్థితిలో ఉన్న పాత విగ్రహం స్థానంలో, గన్నవరం గౌరవాన్ని చాటిచెప్పేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కాంస్య విగ్రహాన్ని పునఃప్రతిష్టించినట్లు ఆయన తెలిపారు. విగ్రహానికి విరాళాలు అందించిన వారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు.