జిల్లాలో స్వమిత్వ సర్వేను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన, జాయింట్ కలెక్టర్ నవీన్ తో కలిసి గన్నవరం మండలంలోని తహసీల్దారు కార్యాలయం నుండి సర్వేయర్లు, ఆర్ఎస్ డిప్యూటీ తహసిల్దారులతో స్వమిత్వ సర్వే పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. గ్రామాల్లో జరుగుతున్న సర్వేను లోపాలు లేకుండా పూర్తి చేయాలని సూచించారు.