రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1.09 లక్షల మంది వితంతువులకు స్పౌజ్ పింఛన్లను ఈనెల నుండి పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం మండలం ముస్తాబాద గ్రామంలో శుక్రవారం కొత్తగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా స్పౌజ్ పింఛన్లను ఎమ్మెల్యే యార్లగడ్డ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. లబ్ధిదారులను, స్థానికులను ఆప్యాయంగా పలకరించిన ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు