గన్నవరం: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ చోరీ కేసు ఛేదన

గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు శుక్రవారం ఛేదించారు. చిన్నారావు, రాంబాబులను అరెస్ట్ చేశారు. రూ. 14 లక్షల విలువైన స్టాంపు పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో వీరు పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోరీకి పాల్పడినవారని చెప్పారు. దొంగిలించిన స్టాంపులను విజయవాడలో విక్రయిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్