సమాజంలో విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. గన్నవరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్నారు. గతంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తినిచ్చేవారని ప్రస్తుతం ఆస్తికన్నా విద్యే గొప్పదని అభిప్రాయపడ్డారు.