చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై గన్నవరం శివారులో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. తెలంగాణలోని గట్టుఇప్పాలపల్లి గ్రామానికి చెందిన అనురాధ గన్నవరం హాస్టల్లో చేరేందుకు తల్లిదండ్రులతో వచ్చింది. తిరిగి బస్టాండ్ వద్ద హైవే దాటుతుండగా బైక్ ఢీకొట్టింది. ముగ్గురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.