గన్నవరం మండలం చిక్కవరంలో హోలీ పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది. చెరువు వద్దకు చేతులు కడుక్కోవడానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందారు. మృతుల్లో దుప్పల నవీన్ కుమార్ (11), వెంకట జోసఫ్ (16)గా గుర్తించారు. మరో విద్యార్థి సాయి (16) మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.