హనుమాన్ జంక్షన్ పరిధిలోని హనుమాన్ నగర్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గురువారం పుల్లల విషయంలో జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. కొందరు వ్యక్తులు నిప్పు పెట్టడంతో రవ్వలు ఎగిసి ఇళ్లపై పడ్డాయి. దీనిపై ప్రశ్నించిన స్థానికులతో సదరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వస్తున్నాయి. మంటలు ఆర్పే ప్రయత్నం చేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.