సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో శనివారం రాత్రి గన్నవరం వెస్ట్ బైపాస్‌పై భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. చిన్న అవుటుపల్లి నుంచి గన్నవరం వరకు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. హైదరాబాద్, వైజాగ్ నుంచి వస్తున్న వాహనాలు చిన్న అవుటుపల్లి వద్ద ఎక్కువగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.