ఈ ఏడాది కృష్ణా జిల్లా రాజకీయాల్లో పలు సంచలన అరెస్టులు ప్రకంపనలు సృష్టించాయి. ఫిబ్రవరిలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొడాలి నాని, వంశీ అనుచరులు కూడా వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఈ పరిణామాలు 2025 రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేశాయి.