వీరవల్లి గ్రామంలో సోమవారం ఆడుకుంటూ తలకు గాయమైన నాలుగేళ్ల నాగచంద్రిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గన్నవరం ఆసుపత్రికి తరలించగా, చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించగా, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.