టీడీపీ నేత ఇమ్మానుయేలు పై హత్యాయత్నం

గుడివాడ పట్టణంలోని గుడ్మెన్‌పేటలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీకి చెందిన వేశపోగు ఇమ్మానుయేలు పై వైసీపీకి చెందిన కొందరు నేతలు దాడికి పాల్పడ్డారు. గుడ్మెన్‌పేట సెంటర్ వద్ద ఇమ్మానుయేలు మీద కత్తులు, రాళ్లతో గుంపుగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనను అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులపై కూడా దుండగులు దాడి చేసినట్టు సమాచారం. ఈ ఘటనలో ఇమ్మానుయేలు సహా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో వైసీపీ నేత రాజేష్‌తో జరిగిన చిన్న ఘర్షణే ఈ దాడికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. గుడివాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్