పదేళ్ల బాలుడి దారుణ హత్య

కృష్ణా జిల్లా నందివాడ మండలం పెదలింగంలో శనివారం రాత్రి పదేళ్ల బాలుడు బాలాజీని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బాలుడు తన నానమ్మ లక్ష్మితో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బాలాజీ మృతిచెందగా, లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను విజయవాడ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిమెంట్ రాళ్లతో దాడి జరిగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్