గుడివాడ: 10 కిలోల గంజాయి స్వాధీనం

విజయవాడ ఎన్ఫోర్స్మెంట్ ఆదేశాల మేరకు, ఈగల్ టీం సీఐ రవీంద్ర, సిబ్బంది, మరియు ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం గుడివాడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒడిస్సాకు చెందిన సూరజ్ దిగల్, సోనాలి దిగల్ అనే ఇద్దరి వద్ద నుండి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ కోసం స్టేషన్కు అప్పగించారు.

సంబంధిత పోస్ట్